ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) వైస్ ఛైర్మన్గా దర్శకుడు మెహర్ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. Dy.CM పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం దక్కిందన్నారు. ఏపీని ‘ఫిలిం ఫ్రెండ్లీ’ రాష్ట్రంగా మార్చేందుకు ఈ బోర్డు పనిచేస్తుందని తెలిపారు. అమరావతి తరహాలోనే ఏపీలో కూడా చిత్ర పరిశ్రమను అంతే వేగంగా అభివృద్ధి చేసేందుకు తామంతా కృషి చేస్తామని చెప్పారు.