MLG: జిల్లా జనరల్ హాస్పిటల్ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన 48 గంటల నిరాహార దీక్షను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఆదివారం బీజేపీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం బస్సు యాత్రల్లో పాల్గొనడంతో దీక్షకు హాజరు కాలేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.