AKP: ఏపీ రైతు సంఘం జిల్లా కొత్త కార్యవర్గం ఏర్పాటు అయింది. మునగపాకలో సంఘం జిల్లా స్థాయి మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభల్లో సంఘం జిల్లా అధ్యక్షుడిగా కర్రి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా ఎం అప్పలరాజు, కోశాధికారిగా గండి నాయుడు బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కొరత రాకుండా చూడాలన్నారు.