ELR: సాగిపాడు గ్రామానికి చెందిన కనపర్తి ప్రకాష్ బాబు మరో మహిళ విషయంలో భార్య రమ్య(33)ను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించాడు. భర్త వేధింపులు తట్టుకోలేక రమ్య శనివారం వంటగదిలో ఉరివేసుకోగా, చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించేసరికే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం భర్తను ఆదివారం అరెస్ట్ చేశారు.