SDPT: ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ ‘రైతు గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. రేపు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్‌ను పార్టీ నాయకులు సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, చెల్లింపుల ఆలస్యం, తేమ శాతం సమస్యలపై వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమంలో రాంచందర్ రావు, రఘునందన్ రావు, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.