GDWL: ఇటిక్యాల మండలం కోదండాపూర్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై బీజేపీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా ప్రక్షాళనపై స్పష్టత ఉండాలని గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి కేకే రెడ్డి అన్నారు. చనిపోయిన, వలస వెళ్లిన, వివాహమైన వారి ఓట్లను BLOలకు తెలియజేయాలని సూచించారు. ఎర్రవల్లి మండల అధ్యక్షుడు జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.