SKLM: కవిటి మండలం తిప్పనపుట్టుగకు చెందిన నటుడు, దర్శకుడు మజ్జి పురుషోత్తం ఉద్దానానికి గర్వకారణమని ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ అన్నారు. ఈనెల 27న సోంపేట శివ థియేటర్లో విడుదల కానున్న ఆయన ‘మర్రిఊడ’ హర్రర్ కామెడీ చిత్ర పోస్టర్ను విప్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి రాజు, లోళ్ల రాజేష్ పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.