AP: నెల్లూరు విద్యావ్యవస్థను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలుపుతామని మంత్రి నారాయణ అన్నారు. పరమేశ్వరి నగర్లో రూ.20 కోట్లతో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను ఆయన పరిశీలించారు. నగరంలో 15 వేల మంది పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్యను అందిస్తామన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.