TPT: వరదయ్యపాళెం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సుధీర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారని, అర్జీలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామన్నారు. చిన్న సమస్యల కోసం కలెక్టరేట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని, అవకాశాన్ని ఉపయోగించుకోవలని తెలిపారు.