ఎగ్జిబిటర్స్పై నటుడు బాలకృష్ణ స్పందించాడు. సినిమాను బతికించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఎగ్జిబిటర్స్ను చూస్తే జాలేస్తుందన్నారు. థియేటర్లకు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కష్టాల్లో ఉన్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు సర్కార్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు.