BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఈరోజు 3600 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రసాద విక్రయాలతో రూ.25,84,070, VIP దర్శనాలతో రూ.17,99,100, బ్రేక్ దర్శనాలతో రూ.7,88,100, కార్ పార్కింగ్ తో రూ.10,50,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.78,73,479 ఆదాయం సమకూరినట్లు EO భవాని శంకర్ తెలిపారు.