MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామ శివారు ఫామాయిల్ తోటలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రైతుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.