NRML: నిర్మల్ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం లక్ష్యంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శ్యామ్ ఘడ్, ధర్మసాగర్ చెరువును పరిశీలించారు. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, కోతుల బెడద తగ్గింపుతో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.