AKP: ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఈనెల 22న తమ్ముడు సంజీవ్ కుమార్ రాయ్‌ను ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసిన అన్న రాజీవ్ కుమార్ రాయ్‌ను అరెస్టు చేసినట్లు సీఐ ధనుంజయరావు ఆదివారం తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సొంత అన్నదమ్ములైన వీరిద్దరి మధ్య పాత కక్షలు కారణంగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.