ASF: సిర్పూర్ (టి) మండల కేంద్రంలో ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ రాజశేఖర్ తాత్కాలిక బస్సు సెంటర్ స్థలాన్ని పరిశీలించి, పనులు ప్రారంభించారు. గ్రామానికి చెందిన గద్దల సుజాత అనే మహిళ ఆ భూమి తనదంటూ ఆదివారం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ భూ వివాదం కారణంగా తాత్కాలిక బస్టాండ్ పనులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.