NRML: జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వ లారీలతో పాటు ఇతర రవాణా వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని వెల్లడించారు.