HNK: హసన్పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామంలోని కాంక్రీట్ వర్క్ కార్మికులతో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. కార్మికులకు నిత్యం అండగా ఉంటూ కార్మికుల పక్షాన పోరాడుతామని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ హక్కుల సాధనకు కృషి చేయాలని దాస్యం అన్నారు.