SRD: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటనలో పోలీసులు ఎల్గోయి శివారులో మృతదేహాన్ని వెలికితీశారు. జేసీబీ సహాయంతో తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. వైద్యుడు అవినాష్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.