SDPT: శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈనెల 26న హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన నగదు హుండీలతో పాటు ధాన్యం హుండీలను కూడా ఆలయ ప్రాంగణంలో తెరిచి లెక్కించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది, అధికారులు సమయానికి చేరుకోవాలని ఈవో సూచించారు.