HYD: BRS అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పాతబస్తీని సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అజాంపురలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి KCR ఆనవాళ్లు లేకుండా చేయలేరని, భారతదేశం ఉన్నంతవరకు ఆయన పేరు ఉంటుందన్నారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.