WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ మ్యాపింగ్ శాతం పెంచేందుకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించారు. ఆదివారం శివనగర్, చింతల్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ బీఎల్వోలు, బీఎల్ఏలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.