JGL: సారంగాపూర్ మండలం రేచపల్లి జడ్పీ హైస్కూల్లో 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. 25 ఏళ్ల తర్వాత ఒకటైన స్నేహితులు “ఎక్కడో పుట్టి ఇక్కడే కలిశాం” అంటూ ఉపాధ్యాయులతో కలిసి పాటలకు స్టెప్పులేసి సందడి చేశారు. చిన్ననాటి మధురస్మృతులను నెమరువేసుకుంటూ తమకు చదువు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.