ADB: హైదరాబాద్‌లో జరిగిన 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్-2026లో ఆదిలాబాద్‌కు చెందిన వై. అనుదీప్ రాజ్ సత్తా చాటాడు. శని, ఆదివారాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో ఆయన కాంస్య పతకం సాధించి జిల్లాకు కీర్తి తెచ్చాడు. అనుదీప్ రాజ్ ప్రతిభను క్రీడాకారులు, అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.