MDCL: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ బుద్దానగర్లో BRS పార్టీ ఆధ్వర్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు కాలనీల్లో పర్యటించి నీటి సమస్యలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సమర్థవంతమైన తాగునీటి సరఫరా జరిగేదని, కానీ ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలకు ఈ కష్టమని పేర్కొన్నారు.