TG: న్యాయవాది మొయిజుద్దీన్ హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కవాడిగూడకు చెందిన వినయ్ సహా నలుగురిని కల్వకుర్తి, గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అడ్వొకేట్ను మాసబ్ ట్యాంక్ పరిధిలో కారుతో వినయ్ ఢీకొట్టినట్లు గుర్తించారు. కాగా వక్ఫ్ ఆస్తుల విషయంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.