NGKL: వంగూరు మండలం అన్నారం తండాకు చెందిన ముదావత్ శక్రు నాయక్ వరి గడ్డిని లింగాసనిపల్లి నుంచి తరలిస్తుండగా మార్గమధ్యంలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 120 వరి గడ్డి కట్టలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితుడు కోరుతున్నారు.