NLR: వింజమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాతనగర్ కాలనీలో ఉదయశ్రీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కావలి డీఎస్పీ పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో 53 బైకులు, 3 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకొని పత్రాలు పరిశీలించారు. ప్రజలకు గంజాయి, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.