ASR: ముంచంగిపుట్టు మండలం కుమడ, బూసీపుట్టు, రంగబయలు, వనుగుమ్మ పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గ్రావిటీ పథకాలు పనిచేయక గ్రామాల్లో కుళాయిలు నిరుపయోగంగా మారాయి. కుమడ పంచాయతీ పిట్టగెడ్డ గ్రామ ప్రజలు ఊట నీటిపైనే ఆధారపడుతున్నారు. మహిళలు నీటి కోసం కొండలు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.