NTR: విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ట్రాఫిక్ సీఐ ప్రభాకర్, ఎస్సై కృష్ణ ఆధ్వర్యంలో పైపుల రోడ్డు సెంటర్ వద్ద ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు, వాహనదారులకు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. మండుతున్న ఎండల్లో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.