AP: బండారు దత్తాత్రేయ ప్రజల మధ్య నుంచి వచ్చిన మహోన్నత వ్యక్తి అని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు కొనియాడారు. దత్తాత్రేయ జీవిత చరిత్ర ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. తల్లి ధైర్యమే దత్తాత్రేయను ఈ స్థాయికి తెచ్చిందని, దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని గుర్తుచేశారు.