పార్వతీపురం మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనను అభివృద్ధికి అనుకూలంగా శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఒకే వీధిని రెండు, మూడు వార్డులుగా విభజించడం వల్ల అభివృద్ధి దెబ్బతింటుందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో సమీప ప్రాంతాలను ఒకే వార్డుగా ఏర్పాటు చేయాలని కోరారు.