TPT: నాగలాపురంలో తార్పాలిన్ కప్పకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ట్రాక్టర్ల నుంచి ఎగిరిపడుతున్న ఇసుక ద్విచక్ర వాహనదారుల కళ్లలోకి వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై దుమ్ము వ్యాపించి పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.