ATP: గార్లదిన్నె మండలం కణంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్క్ శంకుస్థాపన రేపు ఉదయం 10 గంటలకు జరగనుంది. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.