KRNL: అక్షరదోషం కారణంగా తప్పుగా నమోదైన కర్నూలు CCS సీఐ పుల్లెం రామాంజులు పేరును సర్వీస్ రికార్డుల్లో సవరిస్తూ ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ అభ్యర్థన మేరకు ‘పుల్లెం రామానుజులు’గా మార్చినట్లు పేర్కొన్నారు. అటు గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా CFMS, HRB పేరోల్, ESR రికార్డుల్లో కూడా సవరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.