కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలోని ‘తత్తెహక్కలు’ నదిలో చేపల వేటకు దిగిన 11 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి, 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిది భట్కల తాలూకా సిరాలి గ్రామంగా పోలీసులు గుర్తించారు. మిలిగిన ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.