HNK: హసన్పర్తి మండలం చింతగట్టులో అండర్ బ్రిడ్జి కింద రోడ్డు దెబ్బతిని కంకర తేలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతుల కోసం పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా అధ్వానంగా ఉన్న ఈ రోడ్డును వెంటనే బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.