MDCL: ఉప్పల్ నియోజకవర్గంలోని మౌలాలిలో ఆదివారం ఉచిత మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్ నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్యాంప్‌ను ప్రారంభించి, ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. శిబిరంలో కంటి, దంత, ఫిజియోథెరపీ, హోమియోపతి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించగా, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.