నెల్లూరు రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్ చైతన్యపురిలో రూ.29 లక్షలతో నూతన పార్కును ప్రారంభించినట్లు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.7 కోట్లతో నియోజకవర్గంలోని ఓపెన్ స్పేస్ పార్కులకు కాంపౌండ్ కట్టి, రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను సంరక్షించామని ఆయన వెల్లడించారు.