NLR: యోగాతో ఆరోగ్యం- ఆనందం లభిస్తాయని యోగాసన జిల్లా అధ్యక్షులు చింతగింజల పెంచలయ్య అన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలోని రామకృష్ణనగర్ సత్యసాయి మందిరంలో ఆదివారం యోగాసన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, ఒత్తిడి లేని జీవనం, క్రమశిక్షణ అలవడి శారీరకంగా మానసికంగా చురుకుగా తయారవుతామన్నారు.