NDL: బనగానపల్లె మండలంలోని నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం కావడంతో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.