NTR: బక్రీద్ పండుగ సందర్భంగా నందిగామ పోలీస్ స్టేషన్లో సీఐ పి.శ్రీను ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు, ఇతర మత పెద్దలతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పరస్పర సహకారంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బక్రీద్ సందర్భంగా ఎటువంటి గోవధ జరగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు చేపడతారని పోలీసులు తెలిపారు.