MNCL: గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం ద్వారా పదవీ విరమణ పొందిన కార్మికులకు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యం కల్పించాలని రిటైర్డ్ సింగరేణి కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాలలో మాట్లాడుతూ.. తాము కేవలం రూ. 350 నుంచి రూ. 3000 వరకు మాత్రమే పింఛను పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర పింఛన్ల వల్ల కూలీ పనులు కూడా చేసుకుంటున్నారన్నారు.