TG: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. 142 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటోందని వెల్లడించారు. తాలు, తరుగు విషయంలో రైతులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.