JGL: రాయికల్ పట్టణంలోని కేశవ నగర్లో ఆదివారం విశ్వబ్రాహ్మణ మనమయ భక్త బృందం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు ఘనంగా సమర్పించారు. మహిళలు ఇంటింటికి బోనం తీస్తూ డప్పు చప్పుళ్ళు, పోతరాజుల నడుమ భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నరహరి, శ్రీనివాస్, నర్సయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.