కోనసీమ: “మహానాడు-2026”ను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ఆదివారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జిలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈసారి మహానాడును పూర్తిగా వర్చువల్ విధానంలో నిర్వహించాలని నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని తెలిపారు.