SRCL: కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు.