కృష్ణా: ఘంటసాలలో ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1967 ఏప్రిల్ 21న కచేరి సందర్భంగా విడిది చేసిన ఇంటికి నూతన శోభ తీసుకొచ్చారు. ఆ ఇంటి యజమాని V.వీరశేఖరరావు రూ.4 లక్షలతో భవనాన్ని ఆధునీకరించి రంగులతో అలంకరించారు. ఘంటసాల వారు గ్రామస్థులు, చల్లపల్లి రాజావారు, బంధువులతో సమయం గడిపిన ఈ ఇల్లు ఇప్పటికీ గ్రామంలోని పురాతన గృహాలలో ఒకటిగా ప్రత్యేక ఆకర్షణగా ఉంది.