CTR: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల పోరాటం మరువలేనిదని పార్టీ జోనల్ సమన్వయకర్త దామచర్ల సత్యనారాయణ కొనియాడారు. నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి నివాసంలో ఆదివారం పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈనెల 27, 28 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.