ELR: ద్వారకాతిరుమల చినవేంకన్న క్షేత్ర నిత్య అన్నదాన ట్రస్టు విజయవాడకు చెందిన ఆలపాటి సాంబశివరావు కుటుంబ సభ్యులు ఆదివారం రూ. లక్ష విరాళం అందించారు. ఈ మేరకు నగదు చెక్కును దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించి, ప్రత్యేక బాండ్, తీర్థప్రసాదాలు అందజేసి అభినందించారు.