విశాఖ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డులో వైసీపీతో పాటు వివిధ పార్టీలకు చెందిన 60 కుటుంబాలు ఆదివారం జనసేన పార్టీలో చేరాయి. జబ్బర్ తోట, రెల్లివీధి, పెయిందొరపేట ప్రాంతాలకు చెందిన నాయకులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు సభ్యులు తెలిపారు.